ఢిల్లీలో ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఉత్తరప్రదేశ్లోని మైన్పురి ప్రాంతానికి చెందిన ఆ బాలికపై ఆగస్టు 4వ తేదీ రాత్రి కాశ్మీరీ గేట్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా తనిఖీలు చేయించారు. బస్సు నుంచి కీలకమైన శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, నిందితులకు కఠిన శిక్ష పడేలా సమగ్ర దర్యాప్తును వేగవంతం చేశారు.

Leave a Reply