తన కంపెనీయే తన ఉద్యోగానికి మరో $18,000 (సుమారు ₹15 లక్షలు) అదనపు జీతం ఇస్తూ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోందని అనుకోకుండా తెలుసుకున్న ఒక సీనియర్ డేటా అనలిస్ట్ అనుభవం ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెండేళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగిని, ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ లింక్డ్ఇన్ (LinkedIn) ద్వారా సంప్రదించింది. వారు పంపిన పీడీఎఫ్ (PDF) డాక్యుమెంట్‌లోని జీతం వివరాలు చూసి ఆయన షాక్ అయ్యారు.
ఆ ఉద్యోగ వివరాలు (Job Description) పూర్తిగా తన ప్రస్తుత బాధ్యతలనే పోలి ఉండటం, అలాగే దానికి కేటాయించిన జీతం తన ప్రస్తుత వేతనం కంటే $18,000 ఎక్కువగా ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతి చెందారు.
కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, గత శీతాకాలంలో తన మేనేజర్ సెలవులో ఉన్నప్పుడు ఆరు వారాల పాటు ఆయన బాధ్యతలను కూడా తనే నిర్వహించారు. అంత చేసినా తనకు కేవలం 4% మాత్రమే వేతన పెంపు (Appraisal) ఇచ్చారని గుర్తుచేసుకుని ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
అయితే, వెంటనే తొందరపడి హెచ్.ఆర్ (HR) కు మెయిల్ పంపకుండా, రెండు రోజుల పాటు ఆలోచించి తన మేనేజర్‌ను కలిశారు. మార్కెట్ పరిస్థితులు మరియు తన పనితీరుకు తగినట్లుగా జీతం పెంచాలని కోరగా, మేనేజర్ కూడా దానికి సానుకూలంగా స్పందించి రికమండ్ చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply