పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో నెల రోజుల క్రితం జరిగిన ప్రేమ వివాహం కారణంగా చోటుచేసుకున్న పరువు హత్య తీవ్ర కలకలం రేపింది.
22 ఏళ్ల జగ్జీత్ సింగ్ అనే యువకుడు తన ప్రియురాలిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లిని ఏమాత్రం అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు అతనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఆ యువతి తల్లి పథకం ప్రకారం జగ్జీత్ సింగ్‌ను బస్టాండ్‌కు రప్పించింది.
అతను అక్కడికి చేరుకోగానే, అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న యువతి సోదరులు జస్ప్రీత్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ ఆయుధాలతో జగ్జీత్ సింగ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల్లో ఒకడైన జస్ప్రీత్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తప్పించుకు పారిపోయిన మరో సోదరుడి కోసం గాలిస్తున్న పోలీసులు, ఈ ఘాతుకంపై కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply