“తల్లిదండ్రులూ కాస్త గమనించండి!.. కింద పడిపోతే పరిస్థితి ఏంటి?”. పిల్లలకు ఫోన్ ఇస్తే ముంచుకొచ్చే ముప్పు.. వైరల్ షాకింగ్ వీడియో..!!!

హైదరాబాద్: నేటి తరం పిల్లల్లో సెల్‌ఫోన్‌ల పట్ల ఉన్న విపరీతమైన మోహం, దానివల్ల ఎదురవుతున్న ప్రమాదాలు ఎంత భయంకరంగా మారుతున్నాయో చెప్పడానికి నిదర్శనంగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఒక చిన్నారి అత్యంత ఎత్తయిన చోట ప్రాణాలకు తెగించి కూర్చుని ఫోన్ చూస్తున్న భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను వణకిస్తోంది.

ఇంటి మిద్దె గోడకు ఆనించి ఉంచిన ఒక సన్నటి వెదురు కర్ర (బొంగు) పై, ఎలాంటి భయం లేకుండా ఒక బాలుడు చాలా చాకచక్యంగా కూర్చుని, సెల్‌ఫోన్ స్క్రీన్‌ను అదేపనిగా చూస్తూ ఉండిపోయాడు.

లోకాన్ని మరిచి ఫోన్ వ్యసనంలో బాలుడు:
మండిపోతున్న ఎండను గానీ, అంత ఎత్తు నుండి పొరపాటున కాలుజారి కింద పడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందనే కనీస భయాన్ని గానీ అస్సలు లెక్కచేయకుండా.. చుట్టూ ఉన్న లోకాన్ని పూర్తిగా మరిచిపోయి ఆ బాలుడు మొబైల్ ఫోన్‌లో మునిగిపోయిన దృశ్యం చూసేవారిని నివ్వెరపరుస్తోంది.

ట్విట్టర్‌లో వైరల్ – నెటిజన్ల ఆగ్రహం, ఆందోళన:
ట్విట్టర్ (X) లో @KUNDAN00PATEL అనే అకౌంట్ ద్వారా షేర్ చేయబడిన ఈ ప్రమాదకరమైన వీడియో ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపిస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు.. “ఇప్పటి పిల్లలకు సెల్‌ఫోన్ అనేది ఒక పెద్ద అంటువ్యాధిలా మారిపోయింది. దీనికి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఇప్పటికైనా మీ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి” అంటూ కామెంట్ల రూపంలో తమ ఆందోళనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: