“తెల్లవారుజామున 5:30 గంటలకు వినిపించిన పెను రణగొణ ధ్వనులు..!” డబ్బులిస్తే ఏమైనా చేస్తారా..? రైలు బోగీలోనే మద్యం తాగి హంగామా చేసిన ప్రయాణికులు.. మండిపడ్డ మహిళా యూట్యూబర్..!!

గౌహతి నుంచి కోల్‌కతా వెళ్లే సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీలో ప్రయాణించిన ఓ మహిళా ప్రయాణికురాలికి, తోటి ప్రయాణికుల అసభ్యకర ప్రవర్తన వల్ల ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

సంధ్యా మజ్జి అనే సదరు మహిళా ప్రయాణికురాలు సుఖవంతమైన ప్రయాణాన్ని ఆశించి రైలు ఎక్కగా.. కొందరు తోటి ప్రయాణికులు బోగీలోనే యథేచ్ఛగా మద్యం సేవించడమే కాకుండా, చెత్తను నేలపైనే పారేస్తూ, రాత్రంతా పెద్ద శబ్దంతో పాటలు పెట్టి తీవ్ర అసౌకర్యానికి గురిచేశారని ఆరోపించారు.

బోగీ బయట డస్ట్‌బిన్ ఉన్నప్పటికీ చెత్తను నేలపైనే పడేయడంతో పాటు, తెల్లవారుజామున 5 గంటల వరకు లౌడ్ స్పీకర్లలో పాటలు పెట్టి నిద్రలేకుండా చేశారని ఆమె వాపోయారు. తోటి ప్రయాణికుల ఈ అరాచకాన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ మహిళ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

భారతదేశంలో బహిరంగ ప్రదేశాలలో పౌర స్పృహ (Civic sense), కనీస మర్యాదలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని ఎత్తిచూపిన ఆమె.. “మనం నాగరికత వైపు కాకుండా వెనకడుగు వేస్తున్నట్లు అనిపిస్తోంది” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తూ.. రైలు ప్రయాణాల్లో తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటూ, బహిరంగ ప్రదేశాల్లో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, నిబంధనలను గౌరవించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: