‘దయచేసి మీరు క్రికెట్ చూడకండి’, టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయంపై అమితాబ్ వింత పోస్ట్.. షాక్‌లో నెటిజన్లు!

ICC T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘనవిజయం సాధించిన వేళ అంతా శుభాకాంక్షలు తెలుపుతుంటే, అమితాబ్ బచ్చన్ చేసిన ఒక పోస్ట్ చూసి జనం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన్ని సరదాగా ‘పనౌతీ’ (దురదృష్టవంతుడు) అని కూడా పిలుస్తున్నారు.

ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి, మూడవసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ చారిత్రక విజయం తర్వాత దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. “T 5679 – నేను మ్యాచ్ చూడను అని చెప్పాను కదా, అందుకే మనం గెలిచాం! అయిపోయింది.” అని రాసుకొచ్చారు.

అంటే, తను మ్యాచ్ చూస్తే భారత్ ఓడిపోతుందనే భయం (సెంటిమెంట్) తో ఆయన ఈ మ్యాచ్ చూడలేదని దీని అర్థం. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “అవును సార్, 2023 వరల్డ్ కప్ కూడా మీ వల్లే ఓడిపోయాం, దయచేసి మీరు మ్యాచ్‌లు చూడకండి” అని కొందరు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు “మేము కూడా మా టీమ్ గెలవాలని ఇలాంటి సెంటిమెంట్లు పాటిస్తాం” అని ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

అమితాబ్ తదుపరి చిత్రాలు: వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, అమితాబ్ బచ్చన్ త్వరలో నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 AD’ రెండో భాగంలో అశ్వత్థామగా కనిపించనున్నారు. అలాగే ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 2 – దేవ్’ లో గురువు పాత్రలో అలరించనున్నారు.


Posted

in

by

Tags: