క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనీకి మరియు సిఎస్కే మేనేజ్మెంట్కు మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది.
జడేజా నిష్క్రమణపై అసహనం: గత కొన్నేళ్లుగా చెన్నై జట్టులో ధోనీకి నమ్మకమైన ‘దళపతి’గా, తురుపుముక్కగా ఉన్న రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపి, అక్కడి నుండి సంజూ శామ్సన్ను చెన్నైకి తీసుకురావాలని సిఎస్కే యాజమాన్యం నిర్ణయించింది. తన తర్వాత జట్టును నడిపించేందుకు సంజూ సరైన వ్యక్తి అని ధోనీ భావించినప్పటికీ, కీలక ఆటగాడైన జడేజాను జట్టు నుండి పంపించడం ధోనీకి అస్సలు ఇష్టం లేదట. జడేజాను మార్చవద్దని ధోనీ చెప్పినప్పటికీ మేనేజ్మెంట్ వినకపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.
బ్యాటింగ్ ఆర్డర్‌పై కండిషన్లు: విభేదాలకు మరో కారణం ధోనీ బ్యాటింగ్ ఆర్డర్. ఐపీఎల్ 2026లో ధోనీ ఆఖర్లో కాకుండా కాస్త ముందు వరుసలో బ్యాటింగ్‌కు రావాలని మేనేజ్మెంట్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ధోనీ స్పందిస్తూ.. “నేను ఆఖరి ఓవర్లలోనే బ్యాటింగ్‌కు వస్తాను. అది కూడా చివరి నాలుగు ఓవర్లలో ఓవర్‌కు 15 కంటే ఎక్కువ పరుగులు కావాల్సి వచ్చినప్పుడే బరిలోకి దిగుతాను” అని తెగేసి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆడనని చెప్పిన ధోనీ? సిఎస్కే నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్న ధోనీ, ఐపీఎల్ 2026లో ఆడనని మేనేజ్మెంట్కు చెప్పినట్లు, ఆ తర్వాత అధికారులు ఆయనను ఒప్పించినట్లు సమాచారం. 44 ఏళ్ల వయసులో ధోనీ ఆడే చివరి ఐపీఎల్ సీజన్ ఇదేనని క్రికెట్ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. మేనేజ్మెంట్తో ఏర్పడిన ఈ మనస్పర్థలు జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
