న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్ పెయిడ్ యాడ్స్‌లో పిల్లల లైంగిక దోపిడీ మరియు వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSEAM) కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు కఠినమైన నోటీసులు జారీ చేసింది. CSEAMను ప్రోత్సహించే లేదా అటువంటి కంటెంట్‌కు సులభంగా యాక్సెస్ కల్పించే అన్ని ప్రకటనలను, కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రామ్‌ను ఆదేశించింది.
వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మెటాను కోరింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వ్యవహారంపై 7 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏమిటీ విషయం? ఇన్‌స్టాగ్రామ్‌లోని పెయిడ్ యాడ్స్ ద్వారా యూజర్లను అటువంటి బాహ్య ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లిస్తున్నారని, అక్కడ పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టవిరుద్ధమైన కంటెంట్ అందుబాటులో ఉందని వర్గాలు తెలిపాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్ అల్గారిథమ్ ద్వారా లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం: అటువంటి అశ్లీల కంటెంట్ ప్రచారాన్ని మరియు వ్యాప్తిని అరికట్టడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మెటాకు సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను వ్యాప్తి చేయడం మరియు వాటికి యాక్సెస్‌ను సులభతరం చేయడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి.

Leave a Reply