“దురాశ.” 5,000 రూపాయల లంచం. చేతివాటం చూపించిన కానిస్టేబుల్. “నా ఫోన్‌లో కెమెరా ఆన్‌లో ఉంది సార్.” కోర్టు జరిమానాకు బదులు ఊచలు లెక్కపెడుతున్న పోలీస్ అధికారి. తక్షణ సస్పెన్షన్.!

బెంగళూరు పులికేశి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సోమశేఖర్, లారీ డ్రైవర్ వద్ద లంచం తీసుకున్నారనే ఆరోపణల ఆధారంగా తాత్కాలికంగా సస్పెండ్ అయ్యారు.

గత జులై 18న, నిషేధిత సమయంలో మరియు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ సమయంలో ఇనుప లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ సయ్యద్ అఫ్రోజ్‌పై భారతీయ నస్యాయ సంహిత సెక్షన్ 285 కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసుల్లో కోర్టు మాత్రమే జరిమానా మొత్తాన్ని నిర్ణయించాలనే చట్టం అమలులో ఉన్నప్పటికీ, కానిస్టేబుల్ సోమశేఖర్ వాహనాన్ని వదిలేయడానికి 5,000 రూపాయలు లంచం తీసుకున్నట్లు సమాచారం.

దీనిని రహస్యంగా తన ఫోన్‌లో రికార్డు చేసిన లారీ డ్రైవర్, డబ్బు ఇచ్చిన తర్వాత కూడా కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పాటు లంచం తీసుకుంటున్న వీడియో ఆధారాలను కూడా అతడు సమర్పించడంతో, తూర్పు విభాగపు ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ సాహిల్ బగ్లా విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్ సోమశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Posted

in

by

Tags: