దుస్తులు తొలగించి లైంగిక వేధింపులు.. వారం రోజులుగా మదర్సాకు వెళ్లని బాలుడు, కారణం అడగడంతో బయటపడ్డ దారుణం

హైదరాబాద్ మదర్సా కేసు: చిన్న పిల్లలపై జరిగే తీవ్రమైన నేరాలపై హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2022లో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా ఉపాధ్యాయుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

కేసు వివరాలు.. బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో 2022, మార్చి 23న ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన 11 ఏళ్ల కుమారుడు షాహీన్ నగర్‌లోని ‘మదర్సా జామియా నూరుల్ అన్వర్’లో క్రమం తప్పకుండా చదువుకోవడానికి వెళ్తుండేవాడని, అయితే వారం రోజులుగా బాలుడు మదర్సాకు వెళ్లడం లేదని, చాలా దిగులుగా ఉంటున్నాడని తండ్రి గమనించాడు. విషయం ఏమిటో చెప్పమని బాలుడిని అడగడంతో ఆ దారుణం వెలుగులోకి వచ్చింది.

తండ్రికి వివరించిన బాధితుడు.. తన మదర్సా ఉపాధ్యాయుడు సయ్యద్ నదీమ్ (22), సుమారు నెల రోజుల క్రితం తనను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ తన దుస్తులు తొలగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలుడు తన తండ్రికి వివరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు తనను బెదిరించాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు.

కోర్టు తీర్పు.. సిటీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో – POCSO) చట్టం కింద విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు, నిందితుడు సయ్యద్ నదీమ్ నేరం చేసినట్లు నిర్ధారించింది. అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.


Posted

in

by

Tags: