దేశాన్ని కుదిపేసిన వీడియో వ్యవహారం! అవమాన భరించలేక వ్యక్తి ఆత్మహత్య.. ఆ యువతికి కోర్టు షాక్, బెయిల్ నిరాకరణ!

కేరళలోని కోజికోడ్‌లో బస్సు ప్రయాణంలో ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వీడియో విడుదల చేసి, అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

గత 16వ తేదీన, కోజికోడ్‌కు చెందిన షింజిదా అనే యువతి తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కన నిలబడిన దీపక్ (42) అనే వ్యక్తి తన పట్ల అనాగరికంగా ప్రవర్తించాడని ఆ వీడియోలో ఆరోపించింది. 18 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో, బస్సు రద్దీ కారణంగా దీపక్ చెయ్యి ఆ యువతికి తగులుతున్నట్లుగా ఉంది.

మొదలై సోషల్ మీడియా దాడి

ఆ వీడియో కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందింది. నెటిజన్లు నిజానిజాలు తెలుసుకోకుండా దీపక్‌ను తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ఈ అవమానాన్ని భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్, కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆ వీడియోను నిశితంగా పరిశీలించిన పలువురు.. బస్సులో ఉన్న రద్దీ వల్లే దీపక్ చెయ్యి పొరపాటున తగిలిందని, అతను కావాలని అలా చేయలేదని అతనికి మద్దతుగా గొంతు విప్పారు.

పోలీస్ చర్య మరియు కోర్టు తీర్పు

దీపక్ మరణం తర్వాత, అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కోజికోడ్ పోలీసులు షింజిదాపై కేసు నమోదు చేశారు. పోలీసులకు భయపడి బంధువుల ఇంట్లో దాక్కున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆమె బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సోషల్ మీడియాలో వాస్తవాలు తెలుసుకోకుండా వీడియోలు షేర్ చేసి, ఎదుటివారి ప్రాణాలు తీసేలా వ్యవహరించడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


Posted

in

by

Tags: