ధర ఎక్కువ.. కానీ ఆహారంలో పురుగా?! ఖరీదైన రెస్టారెంట్ల అసలు రంగు బయటపెట్టిన యువకుడు.. నెట్టింట కలకలం రేపుతున్న వీడియో!

గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో వడ్డించిన ఆహారంలో ప్రాణంతో ఉన్న పురుగు పాకుతూ కనిపించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.

గురుగ్రామ్‌ హారిజాన్ సెంటర్‌లోని ప్రసిద్ధ ‘పాల్’ (Paul) బేకరీ & కేఫ్‌కు భోజనం కోసం వెళ్లిన సులభ్ మాథుర్ అనే కస్టమర్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్ అయి వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.

సదరు కస్టమర్ ఉదయం 11 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లి ఆరుకు పైగా వంటకాలను ఆర్డర్ చేశాడు. అందులో భాగంగా తింటున్న ‘సీజర్ సలాడ్’ (Caesar Salad)లో ప్రాణంతో ఉన్న పురుగు ఒకటి పాకడం చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ పురుగు దృశ్యాలను వీడియో తీసి, ఇంత ఖరీదైన రెస్టారెంట్‌లో ఆహార పరిశుభ్రతను గాలికొదిలేయడం అత్యంత విచారకరమని పేర్కొంటూ నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియో 10 లక్షలకు పైగా వీక్షణలు (Views) సాధించి నెటిజన్లలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో, పాల్ రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఆహార నాణ్యత, పరిశుభ్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ అనుకోని తప్పుకు చింతిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా వివరణ ఇచ్చింది. అయితే, ఇది కేవలం మొక్కుబడి మెసేజ్ మాత్రమేనని, ఈ తీవ్రమైన సమస్యను వారు ఏమాత్రం పట్టించుకోలేదని సులభ్ ఆరోపించారు. భారీగా డబ్బులు వసూలు చేసే ఇలాంటి విలాసవంతమైన రెస్టారెంట్ల నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *