ముంబై: మహారాష్ట్రలోని కల్యాణ్ (Kalyan) ప్రాంతంలో గల ఒక రోడ్‌సైడ్ ధాబా (హోటల్) లో ఒక మహిళ అందరూ చూస్తుండగా అనాగరిక రీతిలో ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రజలు కూర్చునే బహిరంగ ప్రదేశంలో ఆమె ప్రవర్తించిన తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాబా ప్రాంగణంలోనే శౌచాలయం (Toiled) సౌకర్యం ఉన్నప్పటికీ, దానిని ఉపయోగించకుండా.. వినియోగదారులు కూర్చుని భోజనం చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే ఆ మహిళ మూత్రవిసర్జన చేసింది.
ప్రశ్నించిన వినియోగదారులు – వీడియో తీసిన మహిళ:
ఆమె చేస్తున్న అనాగరిక చర్యను గమనించిన అక్కడి మరో మహిళా వినియోగదారురాలు.. తన మొబైల్లో దీనిని రికార్డ్ చేస్తూ ఆమెను గట్టిగా నిలదీసింది. “ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, మేమంతా భోజనం చేస్తున్నాము. పక్కనే శౌచాలయం ఉన్నా ఇలా చేయడం ఏంటి?” అని ప్రశ్నించినప్పటికీ, ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
నిర్వాహకులతో వాగ్వాదం:
ఈ విషయం కాస్తా ధాబా సిబ్బంది మరియు మేనేజర్ దృష్టికి వెళ్లడంతో, వారు సదరు మహిళ వద్దకు వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస విచక్షణ లేకుండా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరగా.. ఆమె తన తప్పును అంగీకరించడానికి నిరాకరించింది. పైగా ధాబా సిబ్బంది మరియు యాజమాన్యంతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగింది.
పబ్లిక్ ప్రదేశాలలో మరియు హోటళ్లలో ఇటువంటి అపరిశుభ్ర, అనాగరిక పనులు చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్‌గా మారింది.
