“నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సరిగ్గా పని చేయడం లేదంటూ ఇష్టమొచ్చినట్లు తిడతారా?”.. ఎక్కిళ్ళూ పెడుతూ ఏడ్చిన మహిళా కానిస్టేబుల్.. వైరల్ వీడియో!

“నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. నన్ను చూసి సరిగ్గా పని చేయడం లేదంటూ ఇలానా సార్ ఇష్టమొచ్చినట్లు నోటికొచ్చినట్లు తిట్టేది?” అని తాంబరం జీఎస్టీ (GST) రోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్.. తోటి ట్రాఫిక్ పోలీస్ అధికారి దురుసు ప్రవర్తనకు అక్కడికక్కడే విలవిలలాడుతూ, కన్నీరు మున్నీరుగా ఏడ్చిన హృదయ విదారక వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

చెన్నై పరిధిలోని తాంబరం ప్రాంతంలో ఎప్పుడూ వాహనాల రద్దీతో బిజీగా ఉండే జీఎస్టీ రోడ్డుపై ఆ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక సీనియర్ ట్రాఫిక్ పోలీస్ అధికారి.. ఆమె విధులను సరిగ్గా నిర్వహించడం లేదంటూ తోటి సిబ్బంది, రోడ్డుపై వెళ్తున్న పబ్లిక్ ముందే అత్యంత ఘోరంగా, దురుసుగా గద్దించారు.

అందరి ముందూ జరిగిన ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళా కానిస్టేబుల్.. నడిరోడ్డుపై నిలబడే ఎక్కిళ్ళూ పెడుతూ, ఏడుస్తూ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో దావానంలా వ్యాపించాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ.. “శాంతిభద్రతలను కాపాడే పోలీస్ శాఖలోనే ఒక మహిళా కానిస్టేబుల్‌కు రక్షణ, కనీస గౌరవం లేకపోతే.. ఇక సమాజంలో సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?” అని తాంబరం సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు. బాధ్యుడైన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *