“నడుము ఎముక విరిగిన స్థితిలో కూడా ఇలాగేనా?” పెన్షన్ కోసం ఇబ్బంది పడిన 73 ఏళ్ల వృద్ధురాలు.. ఇంటికే వచ్చిన అధికారులు..!!

ఉత్తరప్రదేశ్‌లో నడుము ఎముక విరిగిన 73 ఏళ్ల వృద్ధురాలిని, ఆమె పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం ఒక తోపుడు బండిపై కూర్చోబెట్టి బ్యాంకుకు లాక్కెళ్లిన దారుణమైన పరిస్థితి దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది.

సదరు వృద్ధురాలు స్వయంగా రాలేరని తెలిసినప్పటికీ, ఆమె స్వయంగా వస్తేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు యాజమాన్యం మొండికేయడంతో ఈ ఘోరం జరిగింది. దీనికి సంబంధించిన హృదయవిదారక వీడియో ఇంటర్నెట్‌లో విడుదలై, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

రంగంలోకి దిగిన అధికారులు
ఈ వీడియో వైరల్ అయ్యి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, అప్రమత్తమైన బ్యాంకు యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగింది. అధికారులు నేరుగా ఆ వృద్ధురాలి ఇంటికే వెళ్లి పెన్షన్ డబ్బులను అందజేశారు. అంతేకాకుండా, తాము చేసిన తప్పుకు చేతులు జోడించి క్షమాపణలు కూడా కోరారు. సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్న ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక పెద్ద చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: