“నన్ను తాకవద్దు!” మొదటి రాత్రే భర్త మండె పగులగొట్టిన నవవధువు; ఆ తర్వాత పోలీసుల ముందు ఆమె చెప్పిన అసలు నిజం ఇది..!!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లో వివాహమైన మొదటి రాత్రే నవవధువు తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి, అతడిని ఆసుపత్రి పాలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

వివాహం ముగిసిన తర్వాత, నూతన వధూవరులను మొదటి రాత్రి గదిలోకి పంపించారు. ఆ సమయంలో వరుడు తన భార్య దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించగా, వధువు దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వరుడు పట్టుబట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు, అతడిని దారుణంగా కొట్టి, చెంపదెబ్బలు కొట్టి నానా రచ్చ చేసింది.

ఈ గొడవ ముదరడంతో, వధువు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని వరుడిపై దాడి చేయడంతో అతని తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుడు, తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసుల విచారణలో, ఆ యువతికి ఈ వివాహం ఇష్టం లేదని, ఆమె వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ పెళ్లి చేశారని తేలింది.

ఈ విషయంపై వధువు సోదరి పోలీసులతో మాట్లాడుతూ.. తన సోదరికి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మొదటి నుండి ఇష్టం లేదనే విషయాన్ని ధృవీకరించింది.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ జీత్ సింగ్ మాట్లాడుతూ, “వధువు తనను తాకవద్దని నిరాకరించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది; ప్రస్తుతం ఇరు వర్గాల వారు చర్చల ద్వారా రాజీకి వచ్చారు” అని తెలిపారు. పెళ్లయిన మొదటి రోజే వరుడు ఇలా దెబ్బలు తిని ఆసుపత్రి పాలవ్వడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: