“నన్ను వదిలేయ్”.. పసుపు రంగు టీ-షర్టు ధరించిన అజ్ఞాత వ్యక్తి.. పారిశుద్ధ్య కార్మికుడిని క్రూరంగా కత్తితో పొడిచిన హంతకుడు – కుప్పకూలిన యువకుడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!!

తూర్పు దిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న అనీల్ (27) అనే యువకుడు, పగటిపూట కత్తితో దారుణంగా హత్య చేయబడ్డాడు.

ఆదివారం ఉదయం 7:27 గంటల ప్రాంతంలో అనీల్ పనిచేస్తున్న సమయంలో, పసుపు రంగు టీ-షర్టు ధరించిన ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి అతనితో వాగ్వాదానికి దిగి, దాచిపెట్టిన కత్తితో పొట్టలో పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ (CCTV) దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడి అనంతరం అనీల్ తన కడుపును పట్టుకుని కొద్ది దూరం నడిచి వెళ్లి కిందపడి దుర్మరణం చెందాడు. చుట్టూ చాలా మంది ఉన్నప్పటికీ ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ ఘటనను ఖండిస్తూ, హంతకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, మృతుడి కుటుంబానికి తగిన పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ నిరసన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ పుటేజ్ ఆధారంగా హంతకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: