“నన్నూ, నా చెల్లెల్నీ కొడుతున్నారు”: పట్టభద్రుడైన యువకుడి ఫిర్యాదు.. ఆగని దాడులు.. కలకలం రేపిన ఘటన.!!

బీహార్ రాష్ట్రం నవాదా ప్రాంతానికి చెందిన హిమాన్షు రాజ్.. ఐఐటీ పాట్నా (IIT Patna) పట్టభద్రుడు. ఆయన కుటుంబంపై నిరంతరం దాడులు జరుగుతుండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

గతంలో జరిగిన దాడిపై కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో, ఆ కేసును వెనక్కి తీసుకుని రాజీకి రావాలని ఒత్తిడి చేస్తూ.. హిమాన్షు రాజ్ కుటుంబ సభ్యులపై, ఆయన చెల్లెలిపై మరోసారి పాశవికంగా దాడి చేశారు.

ఇంతటి తీవ్రమైన ఘటన జరిగినా స్థానిక పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవడంతో.. వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని నవాదా పోలీసులను బీహార్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం (DGP కార్యాలయం) ఆదేశించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *