టెలివిజన్ పరిశ్రమలో పాపులర్ నటి శిల్పా షిండే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల పాత వివాదాలపై చేసిన వ్యాఖ్యల తర్వాత, తన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఆ నకిలీ (Fake) MMS వివాదాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో, ఆ ఘటన తనను మానసిక వేదనకు గురిచేసిందని, తన కుటుంబం కూడా చాలా కష్టాలను ఎదుర్కొందని శిల్పా ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా నుండి ఫోన్ మరియు వైరల్ క్లిప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు, ఒక మీడియా ప్రతినిధి నుండి తనకు ఫోన్ వచ్చిందని శిల్పా చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్లిప్ గురించి ఆయన అడగగా, అసలు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారో తనకు అర్థం కాలేదని ఆమె తెలిపారు.
వీడియో చూసి షాక్ అయిన శిల్పా “ఆ జర్నలిస్టు నాకు క్లిప్ పంపారు. నేను దానిని డౌన్లోడ్ చేసి చూశాను. అది నేను కాదని స్పష్టంగా తెలిసింది. కానీ, నా పేరుతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ‘భాభి జీ MMS వైరల్’ పేరుతో తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేశారు” అని ఆమె చెప్పారు.
తల్లి పడ్డ వేదన ఈ వివాదంలో అత్యంత బాధాకరమైన విషయం తన తల్లికి జరిగిన అవమానమని శిల్పా కన్నీటిపర్యంతమయ్యారు. “నా కూతురిదేనా ఆ వీడియో?” అని ప్రజలు తన తల్లిని అడిగేవారని, అది ఒక కుటుంబానికి ఎంతటి వేదన కలిగిస్తుందో ఊహించుకోవచ్చునని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సైబర్ సెల్ విచారణ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న శిల్పా, సైబర్ సెల్‌ను ఆశ్రయించారు. 7 గంటల పాటు విచారణలో పాల్గొన్న తర్వాత, తనలాగే కనిపించే ఇతర మహిళల వీడియోలను తన పేరుతో తప్పుగా ప్రచారం చేస్తున్నారని తేలిందని ఆమె వెల్లడించారు. ‘బిగ్ బాస్’ తర్వాత కూడా తనను వేధించే ప్రయత్నాలు ఆగలేదని ఆమె పేర్కొన్నారు.
