సూరత్ జిల్లా గోథ్వాడీ గ్రామంలో 22 ఏళ్ల కంప్యూటర్ ఇంజనీర్ నిధి పటేల్ గత ఆగస్టు 24 ఉదయం తన ఇంట్లోనే విగతజీవిగా పడి ఉన్న కేసులో, ఆమె హత్యకు గురై వారం రోజులు గడిచినా నిందితుడిని పోలీసులు ఇంకా గుర్తించలేకపోయారు.
ఈ కేసుకు సంబంధించి ఫలానా వ్యక్తే చేశాడనడానికి సరిపడా ఎలాంటి బలమైన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించేందుకు వేలిముద్రలు, యువతికి సంబంధించిన ఇటీవలి కాల్ డేటా (ఫోన్ సంభాషణలు) సహా అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయినప్పటికీ, ఇప్పటివరకు జరిపిన విచారణలో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను పోలీసులు మరింత ముమ్మరం చేశారు.

Leave a Reply