మీరట్ నగరంలో సంచలనం సృష్టించిన ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో నిందితులైన ముస్కాన్, సాహిల్లకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన వేళ, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు బాధిత కుటుంబంలో సరికొత్త ఆశలు, న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని నింపింది.
దీనిపై మీడియాతో మాట్లాడుతూ రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ముస్కాన్‌కు పడిన శిక్ష లాగే, నా కొడుకుని దారుణంగా పొట్టనబెట్టుకున్న అతని భార్య సోనమ్ రఘువంశీకి, ఆమె ప్రియుడికి కూడా అదే తరహాలో ఉరిశిక్ష విధించాలి” అని కన్నీరుమున్నీరవుతూ డిమాండ్ చేశారు. రాజాను హనీమూన్ కోసమని మేఘాలయకు తీసుకెళ్లి, పథకం ప్రకారం అక్కడి లోతైన లోయలోకి తోసి హత్య చేసిన ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి గతంలో మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కాగా, మేఘాలయ పోలీసులు దాఖలు చేసిన బలమైన ఛార్జ్‌షీట్‌లో మొత్తం 94 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చడంతో, ఈ కేసుపై తుది తీర్పు అతి త్వరలోనే వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.

Leave a Reply