ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేఘన అనే యువతి, తన తండ్రిని క్షయవ్యాధి (టీబీ) కారణంగా కోల్పోయింది. తండ్రి మరణవార్తను వివాహమైన తన నలుగురు అక్కాచెల్లెళ్లకు తెలియజేసినప్పటికీ.. వ్యాధి సోకుతుందన్న భయం, స్వార్థం కారణంగా వారిలో ఒక్కరు కూడా అంత్యక్రియలకు రాలేదని తెలిసింది.
తోడుగా నిలబడేందుకు మరే ఇతర బంధువులూ ముందుకు రాని పరిస్థితుల్లో, మేఘన ఏమాత్రం వెరవక ఒంటరిగానే తన తండ్రి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి, స్వయంగా తానే అంతిమ సంస్కారాలు (ఈమక్రియలు) పూర్తి చేసింది. తండ్రి రగులుతున్న చితి ముందు ఆ ఆడబిడ్డ ఒంటరిగా కూర్చుని రోదిస్తున్న విషాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నాయి; తోబుట్టువుల స్వార్థపూరిత వైఖరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply