ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కనిమెరక గ్రామానికి చెందిన పుంగ సంధ్య (23), రాము ముత్యాలరావును పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కుటుంబంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్ల, పుట్టింటి నుంచి అదనంగా డబ్బు తీసుకురావాలని సంధ్యను ముత్యాలరావు నిత్యం కొట్టి వేధించేవాడు. సంధ్య తల్లి పలుమార్లు ఆర్థిక సాయం చేసినప్పటికీ, అతని దురాశ తీరలేదు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీన సంధ్య తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.
సంధ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నివేదికలో ఆమె ముక్కు, నోరు బలంగా నొక్కడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీనిపై పోలీసులు తమదైన శైలిలో విచారించగా, “నా భార్య కంటే డబ్బే ముఖ్యం” అని చెప్పి భార్యను తానే హత్య చేసినట్లు ముత్యాలరావు అంగీకరించాడు. తప్పించుకునేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

Leave a Reply