“నా భర్త వేరే మహిళతో డ్యాన్స్ చేయడం తట్టుకోలేకపోయా..!” ఊరేగింపులో జరిగిన ఘటనతో తీవ్ర విషాదం.. వివాహిత షాకింగ్ నిర్ణయం.. స్తంభించిపోయిన గ్రామస్థులు..!!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో, వినాయక నిమజ్జన ఊరేగింపులో తన భర్త మరో మహిళతో కలిసి డ్యాన్స్ చేయడం చూసి మనస్తాపానికి గురైన 24 ఏళ్ల వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతురాలిని సంధ్యగా, ఆమె భర్తను జంగుగా పోలీసులు గుర్తించారు.

గత సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి జరిగిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో జంగు మరో మహిళతో కలిసి డ్యాన్స్ చేశాడు. అది చూసిన సంధ్య తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ ఘటనతో ఏర్పడిన మానసిక ఒత్తిడి కారణంగా, గత శుక్రవారం ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి సంతానం లేరు.

సమాచారం అందుకున్న దేవాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *