“నా సీటులో సగం ఆక్రమించి నా పైపైకి పడ్డాడు!” – విమాన ప్రయాణంలో బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించిన పురుష ప్రయాణికుడు. వాపోయిన మహిళ పోస్ట్..!!!

నడిగగనంలో ఎగురుతున్న విమానంలో, పక్కన కూర్చున్న ఒక పురుష ప్రయాణికుడు తన సీటులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించడమే కాకుండా, పదే పదే శరీరాన్ని తాకుతూ, ఒక దశలో బట్టలు విప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా ప్రయాణికురాలు ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది.

విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రత, వ్యక్తిగత స్పేస్ (Personal Space) కు సంబంధించిన ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చిన ఈ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాధితురాలైన మహిళా ప్రయాణికురాలు ఇంటర్నెట్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే పక్కన కూర్చున్న వ్యక్తి తన సీటులో సగాన్ని ఆక్రమించడం ప్రారంభించాడు. ఆ మహిళ పక్కకు జరిగి కూర్చునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ వ్యక్తి పదే పదే తన చేతులు, శరీరంతో ఆమెను తాకుతూనే ఉన్నాడు.

ఆ తర్వాత, హద్దులు మీరి ఆ వ్యక్తి విమానంలోనే తన బట్టలు విప్పడం ప్రారంభించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ మహిళ.. వెంటనే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం వారు.. “విమాన ప్రయాణాల్లో మహిళలకు ఎదురయ్యే ఇలాంటి ఇబ్బందులు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి వెంటనే కఠిన శిక్షలు విధించాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

అదే సమయంలో మరో వర్గం వారు.. భారీకాయం ఉన్న వ్యక్తులకు ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, మానసిక ఆరోగ్య సమస్యల గురించి కూడా ఆలోచించాలని, ఒకవైపు నుంచి మాత్రమే చూసి పూర్తిగా నిందించకూడదని వాదిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *