నాగార్జున 35 ఏళ్లకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్నారు. నాగార్జున, తన కుమారుడు నాగ చైతన్యతో పాటు తాను కూడా ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు, హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు.
అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా ఎంతో యవ్వనంగా కనిపిస్తుండటం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో ఆయన లుక్ చూసి అందరూ ఫిదా అయ్యారు.
ఈ నేపథ్యంలోనే, నాగార్జున తాగే నీళ్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఒక కార్యక్రమంలో ఆయన తాగిన నీళ్ల బాటిల్ ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది సాధారణ నీళ్లు కాదని, దాని పేరు ‘టానిక్ వాటర్’ (Tonic Water) అని, ఆ నీళ్ల ధర లీటరుకు రూ. 500 అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఆయన ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఇదేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
