నాగుపామును నోటితో కొరికి చంపిన బాక్సర్ శునకం.. ఆంధ్రాలో ఆ తర్వాత ఏం జరిగింది

హైదరాబాద్: ఆంధ్రాలో తన ప్రాణాలను పణంగా పెట్టి నాగుపాముతో పోరాడి యజమాని కుటుంబాన్ని కాపాడింది వారి పెంపుడు బాక్సర్ శునకం..

ఇలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఒక నాగుపాము భయాందోళన సృష్టించింది.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి అనే గ్రామం ఉంది.. ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి “బాక్సర్” జాతికి చెందిన శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఇతని ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలం నుండి ఒక పెద్ద నాగుపాము హఠాత్తుగా శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది..

బాక్సర్ శునకం

పాము బుసలు కొడుతూ కలకలం సృష్టించడం చూసి కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేశారు.. ఈ శబ్దం విన్న వారి పెంపుడు బాక్సర్ శునకం, ఎక్కడి నుంచో పరుగెత్తుకుంటూ వచ్చింది.. గుమ్మం వద్దే పామును ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది.

దీంతో పాము శునకాన్ని కాటేయడానికి యత్నించింది.. ఆ సమయంలో పాము పడగ విప్పి, శునకం మూతిపై కాటు వేసింది.. అయినప్పటికీ, విషపాము కాటేసిన నొప్పుని కూడా లెక్కచేయని ఆ శునకం, నోటితోనే పామును గట్టిగా కొరికి నేలకేసి కొట్టి చంపేసింది.

పామును కొరికి ఉమ్మేసి..

పాము చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే శునకం శరీరమంతా విషం పాకిపోయింది. దీంతో శునకం నీరసించిపోయింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన యజమాని శ్రీనివాస్, ఆయన సోదరుడు సురేష్ వెంటనే శునకాన్ని కాకినాడలోని పశువైద్యశాలకు తరలించారు. అక్కడ దానికి తీవ్రమైన చికిత్స అందిస్తున్నారు.

తమ ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన పెంపుడు శునకం త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు…!!


Posted

in

by

Tags: