మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్ (37) అనే వివాహిత, తన భర్త వేద్ ప్రకాష్ పాఠక్‌ను విడిచిపెట్టి, 2022 నుంచి రాజస్థాన్‌కు చెందిన రాజీవ్ రిషి రాజ్‌తో కలిసి పంజాబ్‌లోని జీరక్‌పూర్ దశమేష్ నగర్‌లోని అద్దె ఇంట్లో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్) చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో, నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చిన భర్త వేద్ ప్రకాష్, పూనమ్ సోదరుడితో కలిసి మంగళవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లాడు. తనతో కలిసి కాపురం చేయడానికి తిరిగి రావాలని వేద్ ప్రకాష్ బలవంతం చేశాడు. అయితే అందుకు పూనమ్ నిరాకరించడంతో, భర్తకు మరియు ఆమెతో ఉంటున్న రాజీవ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మాటమాట పెరగడంతో వేద్ ప్రకాష్ రాజీవ్ చెంప చెళ్లుమనిపించాడు. దీన్ని అడ్డుకునేందుకు పూనమ్ పరుగున రాగా, తన బ్యాగులో దాచి ఉంచిన కత్తిని తీసి ఆమెపై విచక్షణారహితంగా పలుమార్లు తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన పూనమ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అడ్డుకోబోయిన వారిని కత్తితో బెదిరించి వేద్ ప్రకాష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జీరక్‌పూర్ పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడైన భర్త కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply