ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించి వాడివేడిగా చర్చలు జరిగాయి.
సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ (I.N.D.I.A) కూటమి నుంచి జనతాదళ్ (యునైటెడ్) [JD-U] పార్టీ, నితీష్ కుమార్ బయటకు వెళ్లేందుకు మనం అనుమతించి ఉండకూడదని, ఆయనను అడ్డుకుని ఉండాల్సిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వెంటనే బదులిస్తూ నితీష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ ఒక ద్రోహి అని, ఆయన ‘ఇండియా’ కూటమిని వీడి వెళ్లిపోవడమే మంచిదైందని చాలా ఆవేశంగా వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ కూటమి నుంచి తప్పుకున్న అంశంపై సోనియా గాంధీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
సోనియా గాంధీ ఇంకా కొనసాగిస్తూ.. నితీష్ కుమార్ అప్పుడే కాకుండా ఇంకా ఆలస్యంగా కూటమి నుంచి బయటకు వెళ్లి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని గుర్తుచేశారు. గత 2024వ సంవత్సరంలో నితీష్ కుమార్ ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలిగిన వ్యవహారంపై సోనియా గాంధీ ఇప్పుడు బహిరంగంగా చేసిన ఈ ఘాటు విమర్శలు జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply