నిషా ఉపాధ్యాయ వైరల్ వీడియో: ‘నా రేటు చెబుతావా?’ – లైవ్ స్టేజ్ షోలో యాంకర్ పైకి చెప్పు విసిరిన భోజ్‌పురి సింగర్

భోజ్‌పురి గాయని నిషా ఉపాధ్యాయ లైవ్ స్టేజ్ షోలో ఒక్కసారిగా కలకలం రేగింది. యాంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన నిషా, వేదికపైనే యాంకర్‌పై దాడికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వివాదానికి కారణమైన ‘రేటు’ వ్యాఖ్యలు బీహార్‌లోని సారన్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో యాంకర్ ముఖేష్ మాట్లాడుతూ.. గాయని నిషా ఉపాధ్యాయ ఫీజు (రేటు) గురించి బహిరంగంగా ప్రకటించాడు. ఒక పాటకు ఇంత, రెండు పాటలకు ఇంత తీసుకుంటుందని అతను జోక్ చేయడంతో ప్రేక్షకులు నవ్వారు. ఇది తన వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉందని భావించిన నిషా తీవ్రంగా స్పందించారు.

స్టేజీపై గందరగోళం వైరల్ అవుతున్న వీడియోలో నిషా నీలం రంగు చీరలో కనిపిస్తున్నారు. యాంకర్ వ్యాఖ్యలకు కోపంతో తన కాలి చెప్పు తీసుకుని అతనిపైకి దూసుకెళ్లారు. అక్కడున్న వారు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. “నా పారితోషికం గురించి బహిరంగంగా మాట్లాడటం తప్పు” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

గతంలోనూ వార్తల్లో నిలిచిన నిషా నిషా ఉపాధ్యాయ భోజ్‌పురి సంగీత రంగంలో ప్రముఖ జానపద గాయని. 2023లో ఒక లైవ్ షోలో జరిగిన కాల్పుల ఘటనలో ఆమె గాయపడినప్పుడు కూడా వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ వివాదం ఆమెను మళ్ళీ చర్చల్లోకి తెచ్చింది.


Posted

in

by

Tags: