“నెలకు 1.8 లక్షల జీతం.. అది కూడా ఊరిలోనే కూర్చుని..!” కార్పొరేట్ నరకం నుండి బయటపడి, 33 ఏళ్ల వయసులో కొత్త బాట పట్టిన యువకుడు.. వైరల్ అవుతున్న పోస్ట్..!!!

నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉండే తీవ్రమైన పని ఒత్తిడి, 9 టూ 5 ‘టార్చర్’ల నుండి విముక్తి పొంది, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి విజయం సాధించాలనుకునే యువతకు 33 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు రోల్ మోడల్‌గా మారారు.

2024 మధ్యలో తన ఫుల్-టైమ్ కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈ యువకుడు, ప్రస్తుతం సొంతంగా స్టార్టప్ ప్రారంభించి నెలకు 1.8 లక్షల రూపాయల వరకు లాభాలను గడిస్తున్నానని సోషల్ మీడియాలో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

“ఇప్పుడు నేను ఎటువంటి కార్పొరేట్ నిబంధనలకు కట్టుబడి లేను. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వర్షాకాలాన్ని నా సొంత ఊరి ఇంట్లోనే ఉంటూ, రిమోట్ వర్క్ ద్వారా ఆస్వాదిస్తున్నాను” అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, కొత్తగా స్టార్టప్ ప్రారంభించే వారికి ఆయన కొన్ని చిట్కాలను కూడా అందించారు. చేతిలో తగినంత పొదుపు (బ్యాకప్ సేవింగ్స్) లేకుండా ఉద్యోగాన్ని వదలవద్దని, ప్రారంభంలో ఎక్కువ డబ్బు ఇచ్చే క్లయింట్ల కంటే, తక్కువ ఇచ్చే క్లయింట్ల నుండే వ్యాపార వ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలో నేర్చుకోవచ్చని ఆయన తెలిపారు.

“కార్పొరేట్ సంస్థల్లో బానిసల్లా బతకడం కంటే ఇదే ఎంతో మేలు” అంటూ చాలా మంది నెటిజన్లు ఈ యువకుడి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags: