నెలకు రూ.85,000 జీతం తీసుకునే భర్త, విడాకుల తర్వాత తన భార్యకు భరణంగా రూ.36.25 లక్షలు చెల్లించాలని పాట్నా హైకోర్టు ఆదేశించింది.
2013లో వివాహమైన ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా వారు చాలా కాలంగా విడివిడిగా జీవిస్తున్నారు.
భార్య తన కుటుంబాన్ని గౌరవించడం లేదని భర్త, తన భర్త కుటుంబ సభ్యులు తనను మానసిక క్షోభకు గురిచేశారని భార్య.. ఇలా ఒకరిపై ఒకరు (పరస్పరం) ఆరోపణలు చేసుకున్నారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు, ఇద్దరూ కలిసి జీవించడానికి ఇష్టపడని పరిస్థితుల్లో, దీనిని ‘పరస్పర క్రూరత్వం’ (Mutual Cruelty) గా పరిగణించి వారి విడాకులను ఖరారు చేసింది.
అంతేకాకుండా, భర్త తన భార్యకు రూ. 36.25 లక్షలను రెండు వాయిదాల్లో నిర్ణీత గడువులోగా చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

Leave a Reply