రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది. త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు రాబోతుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సామాజిక సమీకరణాలపై తీవ్ర కసరత్తు ప్రారంభించాయి. మేయర్ పీఠానికి సంబంధించి స్థానిక రిజర్వేషన్లు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయినప్పటికీ, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి ఎంపికపై విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ఎంపిక వెనుక మంత్రి నారాయణ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా ఉన్న రూప్‌కుమార్ యాదవ్ పేరుతో పాటు.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి , దొడ్డపనేని రాజా నాయిడులపేర్లు తెరపైకి వచ్చాయి. ఈ పేర్లను తెదేపా అధిష్ఠానం వద్దకు పంపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ ముగ్గురులో ఎవరికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారో వారే మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రూప్‌కుమార్‌యాదవ్ పేరు ఎప్పట్నించో వినిపిస్తున్న పేరే. రెండురోజులుగా కొత్తగా గిరిధర్‌రెడ్డి, దొడ్డపనేని రాజా నాయిడులపేర్లు రేసులోకి వచ్చాయి. వైకాపా కూడా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెదేపా నుంచి కూడా దొడ్డపనేని రాజా నాయిడు పేరును తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా దొడ్డపనేని రాజా నాయిడు రేసులో ముందు ఉన్నారు. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న నెల్లూరు నగరంలో 72 డివిజన్లు ఉన్నాయి. ఇలాంటి కీలకమైన కార్పొరేషన్‌కు మేయర్‌గా ప్రజలు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఉండాలి. పార్టీని నమ్ముకుని, కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు గారు సూచించారు. అందులో భాగంగానే దొడ్డపనేని రాజా నాయిడుకి అవకాశం కల్పించవచ్చు.
దొడ్డపనేని రాజా నాయిడు ప్రజా సమస్యలపై పోరాడగలిగే నాయకుడు. నెల్లూరులోని వ్యాపారులు, ఉద్యోగులు, విద్యావంతులు, మేధావుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తి. ఆయన మేయర్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే నాయికుడుగా పేరుంది.

Leave a Reply