బీహార్లోని దర్భంగా వైపు వెళ్తున్న ఓ బస్సులో ప్రయాణించిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ మహిళ, తన పక్క సీట్లో కూర్చున్న పురుష ప్రయాణికుడిని విండో సీటు ఇవ్వాలని కోరింది.
అయితే ఆ ప్రయాణికుడు తన సీటును వదులుకోవడానికి నిరాకరించాడు.
దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ, అతని అనుమతి లేకుండానే వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందులో… “మగవాళ్లతో నిండిన బస్సులో మహిళలకు విండో సీటు ఇవ్వడం కనీస మర్యాద. దారిలో అటూఇటూ నడిచేవారి వల్ల నాకు అసౌకర్యంగా ఉంది” అని చెబుతూ, ఆ ప్రయాణికుడితో పాటు బీహార్ రాష్ట్రాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడింది.
ఈ వీడియోకు 6 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “తాను రిజర్వ్ చేసుకున్న సీటును ఇవ్వనంత మాత్రాన ఒకరిని అనుమతి లేకుండా వీడియో తీసి, సోషల్ మీడియాలో అవమానించడం అత్యంత హేయమైన చర్య” అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, తాను బీహార్ రాష్ట్రాన్ని అవమానించలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇస్తూ ఆ మహిళ మరో వీడియోను విడుదల చేసింది.

Leave a Reply