కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులకు ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఢిల్లీకి చెందిన వార్తా సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్ రిచా పరాశర్, ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ డీసీపీకి ఇచ్చిన ఫిర్యాదులో.. గత అక్టోబర్ 12న సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ తనను నెట్టివేశారని ఆరోపించారు. ఆ సమయంలో తాను 11 వారాల గర్భవతినని, తోసివేయడంతో అదుపుతప్పి కిందపడి చేతులకు గాయాలయ్యాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ‘సర్ గంగారామ్’ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినట్లు తెలిపారు.
ఈ ఘటనపై రాహుల్ గాంధీతో పాటు ఆయన వెంట ఉన్నవారిపై కేసు నమోదు చేసి, వేగంగా మరియు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతకుముందు, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన ప్రదర్శనలు, నినాదాలు చేసిన వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం రాహుల్ గాంధీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆ విచారణ సందర్భంగా, “న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు” అని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహిళా జర్నలిస్ట్ చేసిన ఈ ఫిర్యాదుతో రాహుల్ గాంధీకి న్యాయపరమైన చిక్కులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply