“నేను డ్రమ్‌లో బంధించబడి చావాలనుకోలేదు”. 21 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆమె వేరొకరితో వెళ్లిపోయింది. భార్యను వివాహేతర ప్రియుడికే ధారపోసిన భర్త.!!!

ఉత్తరప్రదేశ్‌లో భార్య వివాహేతర సంబంధంతో మనస్తాపం చెందిన ఒక భర్త, రోజువారీ గొడవలను నివారించేందుకు తానే ముందుండి భార్యను ఆమె ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని, చర్చను రేకెత్తించింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరి గ్రామానికి చెందిన బుద్ధి రామ్ నిషాద్, ఫుల్మతి అనే మహిళకు గత 21 సంవత్సరాల క్రితం ప్రేమవివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఐదుగురు పిల్లలు ఉన్నారు.

కుటుంబం సంతోషంగా సాగుతున్న సమయంలో, ఇటీవల ఫుల్మతికి అదే గ్రామానికి చెందిన అవధేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నాటి నుంచి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో గత రెండు నెలల క్రితం భర్తను, ఐదుగురు పిల్లలను దిక్కులేని వారిగా వదిలేసి, ఫుల్మతి తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.

భార్య తీసుకున్న హఠాత్తు నిర్ణయంతో షాకైన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి ఆ మహిళకు ఎలాగోలా సర్దిచెప్పి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయినప్పటికీ, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య రోజువారీ గొడవలు, తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజువారీ కుటుంబ గొడవలు, మానసిక వేదనతో విసిగిపోయిన భర్త బుద్ధి రామ్ దీనికి ఒక శాశ్వత ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. భార్య మనసును మార్చలేక, ఆమె ఇష్ట ప్రకారమే ప్రియుడితో కలిపేందుకు గ్రామస్థుల సమక్షంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

దీనిని పురస్కరించుకుని ఒక గుడిలో, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో తన భార్య ఫుల్మతికి, ఆమె ప్రియుడు అవధేష్‌కు బుద్ధి రామ్ పెళ్లి జరిపించాడు. అనంతరం వారిద్దరినీ మనస్ఫూర్తిగా దీవించి పంపించివేశాడు.

ఈ ఘటనపై మాట్లాడిన భర్త బుద్ధి రామ్, “నాకు ప్లాస్టిక్ డ్రమ్‌లో బంధించబడి చావడం ఎంతమాత్రం ఇష్టం లేదు, నాకు ప్రశాంతంగా జీవించాలని కోరికగా ఉంది. 21 సంవత్సరాల క్రితం నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నవాడినే. కానీ, ఆమెకు మా ప్రేమ కంటే ప్రియుడిపైనే మక్కువ ఎక్కువగా ఉంది. నా భార్య సంతోషంలోనే నా సంతోషం కూడా ఉంది” అని బహిరంగంగా తెలిపారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన, ధైర్యంతో కూడిన పెళ్లి ఆ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *