“నేను పడిన కష్టాలు నా ఉద్యోగులు పడకూడదు.!” సిక్ లీవ్ మొదలుకొని ఓవర్‌టైమ్ పని వరకు.. ఉన్నతాధికారుల తీరును బహిర్గతం చేసిన యువతి.!!!

నేటి యువతరం ఉద్యోగులు ఆఫీసు వాతావరణం, పని వేళలు, మేనేజర్ల ప్రవర్తన గురించి తమ అనుభవాలను సోషల్ మీడియాలో బహిరంగంగా పంచుకుంటున్నారు.

ఆ కోవలోనే, మిథాలీ శర్మ అనే యువతి తన మునుపటి ఆఫీసు అనుభవాలను పంచుకుంది. తన లాంటి ఉద్యోగులు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు, భవిష్యత్తులో తాను మేనేజర్ అయినప్పుడు ఎలా ప్రవర్తించకూడదో నేర్పించాయని ఆమె పేర్కొంది.

మిథాలీ పంచుకున్న ఒక సంఘటనలో, ఆఫీసు పనిలో ఉన్న ఒక తప్పును ఎత్తి చూపినప్పుడు, ఒక సీనియర్ అధికారి తన సోషల్ మీడియా వినియోగం గురించి ప్రశ్నించారని తెలిపింది. తాను కేవలం ఆఫీసుకు సంబంధించిన విషయాన్ని మాత్రమే ప్రస్తావించగా.. సోషల్ మీడియా ప్రపంచం నుంచి బయటకు రావాలని సలహా ఇచ్చారని ఆమె చెప్పింది. ఇలాంటి ప్రవర్తన తనను ఎంతో ఇబ్బందికి గురిచేసిందని వాపోయింది.

అలాగే, చికెన్‌‌పాక్స్ (అమ్మవారు) వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తాను పెట్టిన సిక్ లీవ్ (వైద్య సెలవు), మెడికల్ సర్టిఫికెట్‌‌పై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారని మిథాలీ తెలిపింది. తనను దూరంగా నిలబడి మాట్లాడాలని చెప్పడంతో పాటు, తాను పూర్తిగా కోలుకున్నానా లేదా అని అడిగారని, అసలు తన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదేమోనని అనుమానించారని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, జూనియర్ ఉద్యోగులు అయినంత మాత్రాన వారితో వ్యక్తిగత పనులు చేయించడం, తమ పదవి, అనుభవాన్ని ఉపయోగించి పనులను వారిపై రుద్దడం సరికాదని ఆమె అభిప్రాయపడింది.

పని వేళలు ముగిసిన తర్వాత కూడా పని చేయాలనే మేనేజ్మెంట్‌ అంచనాలను మిథాలీ తప్పుబట్టింది. నిర్ణీత పని వేళలు ముగిశాయని ఉద్యోగి చెప్పడమంటే.. బాధ్యత నుంచి తప్పించుకోవడం కాదని ఆమె స్పష్టం చేసింది. కొత్త ఉద్యోగులకు ఒక పనిని సరిగ్గా వివరించకుండా, వారు దానిని నూరు శాతం సరిగ్గా చేయాలని ఆశించడం, ఏమైనా సందేహాలు అడిగితే మందలించడం చాలా తప్పుడు విధానమని ఆమె అంది. తాను ఎదుర్కొన్న ఈ చేదు అనుభవాలను, భవిష్యత్తులో తాను మేనేజర్‌ స్థానానికి వెళ్లినప్పుడు తన కింది ఉద్యోగుల పట్ల రిపీట్ చేయకూడదన్నదే తన ఉద్దేశమని మిథాలీ స్పష్టం చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *