“నేను మాతారాణిని.. రేటు తగ్గించు..!” బైక్ షోరూంలో మహిళ విచిత్ర నాటకం.. దుకాణదారుడి అదిరిపోయే సమాధానం.. రూ.10 వేలు తగ్గించాలంటూ బెదిరింపులు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఘటన..!!

భర్తతో కలిసి మోటార్ సైకిల్ కొనుగోలు చేసేందుకు బైక్ షోరూమ్‌కు వెళ్లిన ఓ మహిళ, అక్కడ బైక్ ధర వినగానే హఠాత్తుగా వింత చేష్టలు చేస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది.

ఆమె ప్రవర్తనతో షోరూంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఖంగుతిని చుట్టూ గుమిగూడారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన షోరూమ్ యజమాని, అయోమయంతో ఆమె భర్తను చూసి ‘ఈమెకు ఏమైనా పూనకం వచ్చిందా?’ అని అడిగాడు.

వెంటనే ఆ మహిళ షోరూమ్ యజమాని వైపు తిరిగి, తానే సాక్షాత్తూ ‘మాతారాణి’నని చెప్పుకుంటూ.. ‘మీరు బైక్ ధరను మరీ ఎక్కువగా చెబుతున్నారు, నా భక్తులను ఇలా దోచుకోకూడదు’ అంటూ ఆవేశంతో ఊగిపోయింది.

అంతటితో ఆగకుండా, ‘వెంటనే బైక్ ధరలో రూ. 10 వేలు తగ్గించి రూ. 1 లక్షకే ఇవ్వండి, లేదంటే నా ఆగ్రహం నుంచి ఈ షోరూమ్‌ను ఎవరూ కాపాడలేరు’ అంటూ గట్టిగా బెదిరించింది.

ఆ మహిళ పూనకం వచ్చినట్లు ఊగుతూ రకరకాలుగా భయపెట్టినప్పటికీ, షోరూమ్ యజమాని ఏమాత్రం బెదరకుండా బైక్ ధరలో నయాపైసా కూడా తగ్గించేది లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *