ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో దారుణం జరిగింది. పెళ్లి ఊరేగింపుతో (బారాత్) వెళ్తున్న పెళ్లి కొడుకును గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అపాచీ బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు పెళ్లి కొడుకు కారును అడ్డుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
కడుపులో, ముఖంపై బుల్లెట్లు తగలడంతో పెళ్లి కొడుకు రక్తపు మడుగులో పడిపోయాడు. వెంటనే పోలీసులు, బంధువుల సహాయంతో అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో పెళ్లి ఇళ్లలో సంతోషం పోయి విషాదం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
అసలేం జరిగింది?
ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. సరాయ్ఖ్వాజా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్ బింద్ వివాహం, ఖేతాసరాయ్ పరిధిలోని బీబీపూర్ గ్రామానికి చెందిన సోనీ బింద్ అనే యువతితో నిశ్చయమైంది. శుక్రవారం సాయంత్రం బారాత్ వధువు ఊరికి చేరుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగింది.
కారు ఆపి మరీ కాల్పులు
పెళ్లి కొడుకు కారు గ్రామానికి కొద్ది దూరంలో ఉండగా, ఇద్దరు ముసుగు ధరించిన దుండగులు బైక్పై వచ్చి కారును ఆపారు. ఏమాత్రం ఆలోచించకుండా కారులోని పెళ్లి కొడుకుపై కాల్పులు జరిపారు. వెనుక వస్తున్న ఇతర వాహనాల్లోని బంధువులు కాల్పుల శబ్దం విని భయంతో పరుగులు తీశారు. పరిస్థితిని గమనించిన చాలా మంది బంధువులు భయంతో అక్కడికక్కడే వెనుతిరిగి వెళ్ళిపోయారు.
ప్రేమ వ్యవహారమే కారణమా?
సినిమా స్టైల్లో పెళ్లి రోజే ఇలా హత్య చేయడం వెనుక ఏదైనా ప్రేమ వ్యవహారం (Love Affair) ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ మరియు కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటు వధువు రోదనలు మిన్నంటుతున్నాయి. “అతను సెహ్రా (పెళ్లి బాసికం) కట్టుకుని వస్తానని నాకు మాట ఇచ్చాడు” అంటూ ఆమె కన్నీరుమున్నీరవుతోంది.
ఎస్పీ స్పందన
జౌన్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (SSP) కున్వర్ అనుపమ్ సింగ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. “ఈ ఘటన అత్యంత బాధాకరం. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం, త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.
