నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ అరెస్ట్; ప్రధాని కాగానే యాక్షన్‌లోకి బాలేన్!

నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే బాలీంద్ర షా (Balen Shah) వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమం సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అరెస్టులు ప్రారంభమయ్యాయి. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని గుండు ప్రాంతంలో అరెస్ట్ చేయగా, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఉన్నత పదవుల్లో ఉండి కూడా ఉద్యమ సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం జరిగిన కొత్త కేబినెట్ మొదటి సమావేశంలో, గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ‘జనరేషన్ జెడ్’ ఉద్యమంపై ఉన్నత స్థాయి విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను తక్షణమే అమలు చేయాలని ప్రధాని బాలేన్ షా నిర్ణయించారు. ఈ సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సస్మిత్ పోఖ్రెల్ను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు.

కేపీ ఓలీకి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం?

కేబినెట్ భేటీ అనంతరం ప్రతినిధి పోఖ్రెల్ విలేకరులతో మాట్లాడుతూ.. విచారణ కమిషన్ నివేదిక ప్రకారం అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ మరియు హోం మంత్రి రమేష్ లేఖక్ సహా ఇతర ఉన్నతాధికారులు తమ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తేలిందని చెప్పారు. ఈ నేరానికి వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కమిషన్ సిఫార్సు చేసిందని ఆయన వెల్లడించారు.


Posted

in

by

Tags: