భారతదేశంలో కనిపించే క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ మూడవ స్థానంలో ఉంది. మితిమీరిన ధూమపానం మరియు పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
నోటి క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం:
- పుండ్లు: నోరు, గొంతు లేదా పెదవులపై వచ్చే పుండ్లు త్వరగా తగ్గకపోతే అది ప్రధాన లక్షణం కావచ్చు.
- రంగు మార్పు: పెదవుల పైన లేదా నోటి లోపల అసాధారణంగా ఎరుపు లేదా తెలుపు రంగు మచ్చలు కనిపించడం, నోటి పూత (Mouth ulcers) లాంటివి ఉంటే వెంటనే పరీక్షించుకోవాలి.
- వాపు: చిగుళ్ల వాపు వంటి వాపులు నోటి లోపల ఎక్కడైనా కనిపిస్తున్నా జాగ్రత్తగా ఉండాలి.
- అస్వస్థత: నోటిలో మంట, అసౌకర్యం, భారంగా అనిపించడం మరియు గొంతు నొప్పిని తేలికగా తీసుకోకండి.
- రక్తస్రావం మరియు మొద్దుబారడం: నోటి నుండి రక్తం రావడం, పళ్ళు ఊడిపోవడం, దవడ లేదా నాలుక కదపడంలో ఇబ్బంది, నోరు మొద్దుబారడం వంటివి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు.
- ఇతర లక్షణాలు: గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడం, గొంతులో మార్పు (Hoarseness), నిరంతరం దగ్గు, ఆహారం మింగడంలో లేదా నమలడంలో ఇబ్బంది, మాట్లాడటంలో ఇబ్బంది వంటివి కూడా లక్షణాలే.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, సొంతంగా నిర్ణయాలకు రాకుండా ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. ప్రారంభ దశలో గుర్తిస్తే నోటి క్యాన్సర్‌ను త్వరగా నయం చేయవచ్చు.

Leave a Reply