చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో నోటి దుర్వాసన ఒకటి. ఇది పది మందిలోకి వెళ్లినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు, వాటిని గుర్తించి పరిష్కరించుకోవడం ముఖ్యం. నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
- రెండుసార్లు బ్రష్ చేయండి: రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి. నాలుకను కూడా శుభ్రం చేయండి, ఎందుకంటే బ్యాక్టీరియా నాలుకపై చేరి దుర్వాసనను కలిగిస్తుంది.
- మౌత్ వాష్ వాడండి: బ్యాక్టీరియాను చంపడానికి యాంటీ-మైక్రోబియల్ లేదా యాంటీ-బ్యాక్టీరియల్ మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోండి.
- నీరు ఎక్కువగా తాగండి: నోరు ఆరిపోవడం వల్ల దుర్వాసన పెరుగుతుంది. కాబట్టి రోజూ ధారాళంగా నీరు తాగాలి.
- ఈ ఆహారాలను నివారించండి: వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారం మరియు అసిడిక్ స్వభావం ఉన్న ఆహారాలు దుర్వాసనకు కారణమవుతాయి. వీటి వాడకాన్ని తగ్గించండి.
- ధూమపానం వదిలేయండి: పొగతాగడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.
- మద్యపానానికి దూరంగా ఉండండి: మద్యం సేవించడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు.
- యాలకులు: భోజనం తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు నమలడం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
- లవంగాలు: భోజనం తర్వాత లవంగాలు నమలడం కూడా దుర్వాసనను తగ్గిస్తుంది.
- పుదీనా: పుదీనా ఆకులు నమలడం లేదా పుదీనా టీ తాగడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
- సోంపు (పెద్ద జీలకర్ర): భోజనం తర్వాత కొద్దిగా సోంపు తినడం అలవాటు చేసుకోండి. ఇది నోటిని తాజాగా ఉంచుతుంది.
