నోట్లో గుడ్డలు కుక్కి కిరాతకం.. ప్రైవేట్ భాగాలను కొరికి హింస.. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం! టోంక్ ఘటనపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

రాజస్థాన్‌లోని టోంక్ నుండి వెలుగులోకి వచ్చిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక మైనర్ దళిత బాలికను ఫైజల్ అనే యువకుడు, అతని స్నేహితులు కలిసి 18 నెలల పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సమాజంలో బలహీన వర్గాల రక్షణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

ఘటన వివరాలు: టోంక్‌కు చెందిన 14 ఏళ్ల దళిత బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫైజల్‌తో పరిచయం ఏర్పడింది. మొదట ఆమె వీడియోలను పొగుడుతూ నమ్మకం సంపాదించిన ఫైజల్, ఆ తర్వాత ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత బాలికకు తెలియకుండా ఒక అసభ్యకరమైన వీడియో తీసి, దానిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు.

18 నెలల నరకం: బ్లాక్ మెయిల్ చేస్తూ బాలిక వద్ద నుండి ₹4,000 వసూలు చేయడమే కాకుండా, 18 నెలల పాటు ఆమెపై నిరంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి, ఆమె ప్రైవేట్ భాగాలను పళ్ళతో కొరుకుతూ శారీరకంగా, మానసిక హింసకు గురిచేశాడని బాధితురాలు వాపోయింది.

ఆ తర్వాత ఫైజల్ ఆ వీడియోను తన స్నేహితులతో పంచుకున్నాడు. అతని స్నేహితుడు అర్బాజ్ ఆ బాలికను కారులో ఒక కేఫ్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయగా, మరో ఇద్దరు స్నేహితులు బనాస్ నది సమీపంలోని హైవే వద్ద ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసుల చర్యలు: బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో టోంక్ పోలీసులు ఐపీసీ మరియు పోక్సో (POCSO) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ఫైజల్ మరియు అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


Posted

in

by

Tags: