పట్టపగలు చోటుచేసుకున్న దారుణం.. పాఠశాలలో వరుసగా వినిపించిన తుపాకీ శబ్దాలు. పరుగులు తీసిన విద్యార్థులు. గుండెలను పిండేసే దృశ్యం.!

థాయిలాండ్‌లోని నోంతబురి ప్రావిన్స్‌లోని దెబ్‌సిరిన్ నోంతబురి హైస్కూల్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం వెలువడింది.

బ్యాంకాక్ నగరానికి వాయవ్యంగా దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంగ్ క్రుయ్ జిల్లాలోని ఈ పాఠశాలలో, అదే పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి హఠాత్తుగా కాల్పులు జరిపాడు. దాడి తర్వాత, ఆ భవనంలోని మూడో అంతస్తులో ఆ విద్యార్థి తనను తాను గదిలో బంధించుకున్నట్లు ప్రాథమిక వార్తలు తెలుపుతున్నాయి.

ఈ సంఘటన అనంతరం గాయపడిన వారిని వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో, దాడికి పాల్పడిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు నోంతబురి ప్రావిన్స్ పోలీస్ చీఫ్ ధ్రువీకరించారు. ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు గల కారణాలపై థాయిలాండ్ పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *