“పరిశుభ్రత లోపం వల్ల వచ్చే వ్యాధి కాదిది!”.. వెస్టిండీస్ క్రికెటర్ ముఖంపై ఆ తెల్లటి మచ్చలు.. ఆలోచింపజేసే వైద్య వివరణ.. వైరల్ అవుతున్న వీడియో..!!

గౌహతిలో భారతదేశంతో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్‌లో, వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు.

మ్యాచ్ ప్రారంభం నుంచే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన అతడు, భారత బౌలర్లపై ఏమాత్రం దయచూపకుండా విరుచుకుపడుతూ అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ బాది దడదడలాడించాడు. అయితే, అతని ధనాధన్ ఆటతీరుతో పాటు, అతని ముఖం, చేతులపై కనిపించిన తెల్లటి మచ్చలు మరియు చర్మపు రంగు మార్పులు వీక్షకుల దృష్టిని తక్షణమే ఆకర్శించాయి.

మైదానంలో అతడు అద్భుతంగా రాణించినప్పటికీ, అతని ఆరోగ్యం గురించి, చర్మంపై ఉన్న ఆ ప్యాచెస్ గురించి అభిమానుల్లో పలువురు రకరకాల ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. బయటకు వచ్చిన ఫోటోలను బట్టి వైద్యపరంగా పూర్తిగా నిర్ధారించలేకపోయినప్పటికీ, ఆ మచ్చలు ‘విటిలిగో’ (Vitiligo – బొల్లి) అని పిలిచే ఒక రకమైన చర్మ వర్ణద్రవ్యం లోపించే (Skin Pigment Loss) సమస్యలా కనిపిస్తున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మెలానోసైట్స్ (melanocytes) అనే రంగును ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేయడం వల్ల ఇది సంభవిస్తుందని చెబుతారు.

ఈ విటిలిగో సమస్య ఏ చర్మపు రంగు ఉన్నవారికైనా రావచ్చని, ఇది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ (autoimmune condition) అని వైద్యులు పేర్కొంటున్నారు. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ఇది వ్యక్తిగత పరిశుభ్రత లోపం వల్ల వచ్చేది కాదు, అలాగే ఇతరులకు వ్యాపించే (అంటువ్యాధి) స్వభావం ఉన్నది కూడా కాదు. అందిన సమాచారం ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో ఆడుతున్న విటిలిగో సమస్య ఉన్న మొదటి క్రికెటర్‌గా జాన్ క్యాంప్‌బెల్‌ను భావిస్తున్నారు. శారీరక సవాళ్లను సైతం అధిగమించి, తన అద్భుతమైన నైపుణ్యంతో అంతర్జాతీయ వేదికపై రాణిస్తున్న జాన్ క్యాంప్‌బెల్ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


Posted

in

by

Tags: