ఢిల్లీలో అత్యంత బొద్దుగా, ముద్దుగా ఉండే కుక్కను ఎంపిక చేసేందుకు “ఫ్యాట్ డాగ్స్ ఆఫ్ ఢిల్లీ” (Fat Dogs of Delhi) అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నిర్వహించిన వినూత్నమైన ఆన్లైన్ పోటీ నెట్టింట తీవ్ర వైరల్గా మారింది.
ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 64 బొద్దుపాటి కుక్కలు ఈ పోటీలో పాల్గొన్నాయి. పరుగెత్తడం, గెంతడం లాంటి కష్టమైన పనులేమీ లేకుండా.. కేవలం సోషల్ మీడియాలో నెటిజన్ల ఓట్లను పొందడమే ఈ పోటీకి ఉన్న ఏకైక నియమం.
రోహిణి ప్రాంతానికి చెందిన ‘కుత్తా సింగ్’, నోయిడాకు చెందిన ‘మహాకుత్తేశ్వర్’, అలాగే ‘బోండా’, ‘బర్ఫీ’ వంటి కుక్కల ఆసక్తికరమైన పేర్లు, వాటి బొద్దుపాటి ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని ప్రారంభించిన ఈ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా, అమెరికాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ‘ఫ్యాట్ బేర్ వీక్’ (Fat Bear Week) పోటీల తరహాలో ఇక్కడ ఈ కుక్కల పోటీని నిర్వహించారు.
సెప్టెంబర్ 24న ప్రారంభమై 6 రౌండ్లుగా జరిగిన ఈ ఆన్లైన్ పోటీలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా నెటిజన్లు తమకు నచ్చిన కుక్కలకు ఓటు వేశారు. ఈ పోటీ తుది ఫలితాలు, ఢిల్లీలోనే అత్యంత ‘బొద్దుపాటి కుక్క’గా గెలిచిన విజేత వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Leave a Reply