పాకిస్తాన్ ప్రభుత్వం మరియు జనరల్ అసిమ్ మునీర్ పతనానికి నాందిగా, ఆ దేశంలో భారీ తిరుగుబాటు మొదలైంది. తహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు పాకిస్తాన్ పోలీసు అధికారులను బహిరంగంగా అపహరించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. క్విట్టా నగర వీధుల్లో అర్ధరాత్రి నుండి అరాచకం తాండవిస్తోంది. ఈసారి ప్రజల ఆగ్రహం కేవలం ఉగ్రవాదులపైనే కాదు, తమ సొంత సైన్యంపై కూడా తీవ్రస్థాయిలో ఉంది. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి, సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. “ఈ ఉగ్రవాదానికి వెనుక యూనిఫాం ఉంది (సైన్యమే కారణం)” అంటూ క్విట్టా మారుమోగిపోతోంది.
సైన్యం పిరికిపంద చర్యలు: క్విట్టా మరియు జియారత్లో TTP ఉగ్రవాదులు పోలీసు అధికారులను వేటాడుతూ దాడులు చేస్తున్నప్పుడు, పాకిస్తాన్ సైన్యం మూడు గంటల పాటు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉగ్రవాదులు పోలీసుల మృతదేహాలను కూడా ఈడ్చుకెళ్లారు. ఆ సమయంలో పిరికిపందలా వ్యవహరించిన సైన్యం, మృతదేహాలను వెలికితీసే క్రమంలో క్రెడిట్ కోసం రంగంలోకి దిగింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా బలవంతంగా పోలీసు లైన్లకు తరలించే ప్రయత్నం చేయడంతో, ఆగ్రహించిన ప్రజలు సివిల్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లి, సైనిక జవాన్లను తరిమికొట్టారు.
ప్రజా ఆగ్రహం వెనుక కారణం: బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం సామాన్య ప్రజలపై చేస్తున్న అరాచకాలు, అమాయకులను అదృశ్యం చేయడం వల్లే ఈ తీవ్రవాద దాడులు పెరిగాయని స్థానికులు నమ్ముతున్నారు. ఇప్పుడు సైన్యం వైఫల్యం వల్ల పోలీసులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. ఆసుపత్రి బయట మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు.
ముక్కలవుతున్న పాకిస్తాన్? పాకిస్తాన్ ఇప్పటికే అన్ని వైపుల నుండి చిక్కుల్లో ఉంది. ఒకవైపు ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రజలు తమ దేశాధినేతలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం రోడ్లపై పోరాడుతున్నారు. మరోవైపు బలూచిస్తాన్ కూడా పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాల వైపు అడుగులు వేస్తోంది. బలూచ్ తిరుగుబాటుదారులు పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇతరుల కోసం ఉగ్రవాద ఫ్యాక్టరీని నడిపిన పాకిస్తాన్, నేడు తానే పెంచి పోషించిన ఉగ్రవాదంతో విలవిలలాడుతోంది. PoK చేజారిపోతుండటం, బలూచిస్తాన్లో అలజడి, క్విట్టా వీధుల్లో సైన్యంపై ప్రజల తిరుగుబాటు.. ఇవన్నీ పాకిస్తాన్ ముక్కలవ్వడానికి ఎక్కువ సమయం లేదని సూచిస్తున్నాయి.
