పాకిస్థాన్‌లో లష్కరే మరో టాప్ కమాండర్ పని పూర్తి; అపరిచితుల తూటాలకు బలి!

LeT కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీ హతం: పాకిస్థాన్‌కు చెందిన ప్రధాన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీని ఆదివారం గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. అకస్మాత్తుగా ఎదురుపడి తూటాల వర్షం కురిపించడంతో అఫ్రిదీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో లష్కరే నెట్‌వర్క్‌కు అఫ్రిదీ బ్రాంచ్ హెడ్‌గా వ్యవహరించేవాడు. మీడియా నివేదికల ప్రకారం, యమదూతల్లా దూసుకొచ్చిన దుండగులు అఫ్రిదీకి కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పని పూర్తి చేసి మాయమయ్యారు.

పాకిస్థాన్ అంతటా ‘అపరిచితుల’ భయం: ఆ ‘అపరిచితులు’ ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరికీ తెలియదు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు వారి సురక్షిత స్థావరాల్లోనే ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. పంజాబ్, సింధ్, బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి పీఓకే వరకు భారత్‌పై కుట్రలు పన్నే ఉగ్రవాదులు నేడు ఎక్కడా క్షేమంగా లేరు. గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత సైన్యం డజన్ల కొద్దీ ఉగ్రవాదులను ఏరివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రహస్య దాడుల భయంతో ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగిన ఉగ్రవాదులు ప్రాణభయంతో వణుకుతున్నారు. సినిమా స్టైల్‌లో వచ్చి ఉగ్రవాదులను మట్టుబెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న ఆ అపరిచితులెవరో పాక్ గూఢచారి సంస్థలకూ అంతుచిక్కడం లేదు.

హమ్జా భయం కూడా వెంటాడుతోంది: భారత్‌లో ‘ధురంధర్’, ‘ధురంధర్-2’ సినిమాలు విడుదలైనప్పటి నుంచి పాక్ సైన్యం, ఐఎస్ఐ (ISI) వర్గాల్లో ఆందోళన పెరిగింది. పాక్ పోలీసులకు ఇప్పుడు ప్రతి భిక్షగాడు లేదా అనుమానిత వ్యక్తి భారత గూఢచారిలా కనిపిస్తున్నాడు. అక్కడ పరిస్థితి అంతలా దిగజారింది. పాక్ సైన్యం సొంత ప్రజలపైనే అమానుషంగా ప్రవర్తిస్తోంది. పీఓకే, బలోచిస్తాన్ వంటి చోట్ల ప్రజలపై సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ గందరగోళం మధ్య భారత శత్రువులను ఏరివేస్తున్న తీరు చూస్తుంటే ఆదిత్య ధర్ సినిమాలోని సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి.

పాకిస్థాన్‌లో కలకలం: పాకిస్థాన్ మీడియా మరియు పోలీసులు ఈ హత్యలపై మౌనం వహిస్తున్నారు. ఈ ఘటనలను చాలా జాగ్రత్తగా నివేదిస్తున్నారు. 2026 ప్రారంభం నుండి ఇప్పటివరకు లాహోర్, కరాచీ మరియు ఖైబర్ పఖ్తుంఖ్వాలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన 30 మందికి పైగా టాప్ కమాండర్లు హతమయ్యారు. ఇది పాక్ ఉగ్రవాద గూళ్ళలో అలజడి సృష్టిస్తోంది. ఈ నెల ప్రారంభంలోనే లష్కరే సహ వ్యవస్థాపకుడు, హఫీజ్ సయీద్ సన్నిహితుడు అమీర్ హమ్జాపై కూడా లాహోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి గాయపరిచారు.


Posted

in

by

Tags: