పాక్-అఫ్గాన్ యుద్ధం: బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా; “ఇక దమా.. దమ్ మస్త్ కలందర్” అంటూ హెచ్చరిక!

ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్‌లోని సైనిక స్థావరాలపై గురువారం అర్ధరాత్రి వైమానిక దాడులు చేసిన పాకిస్థాన్, ఇప్పుడు బహిరంగ యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రకటించారు.

ఖవాజా తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు: “ఇక మన మధ్య బహిరంగ యుద్ధం మొదలైంది. ఇక ‘దమా.. దమ్ మస్త్ కలందర్’ (నిర్ణయాత్మక పోరాటం) జరుగుతుంది.”

భారతదేశానికి అఫ్గాన్ ప్రాక్సీగా మారిందని ఆరోపణ: నాటో దళాల నిష్క్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొంటుందని, తాలిబన్లు ప్రాంతీయ సుస్థిరతపై దృష్టి పెడతారని ఆశించామని, కానీ తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను భారతదేశానికి ఒక కాలనీగా మార్చేశారని ఖవాజా ఆరోపించారు. అఫ్గాన్ భూభాగాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చి, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మా సహనం నశించింది.. అల్లా హు అక్బర్: “పాకిస్థాన్ గత 50 ఏళ్లుగా 50 లక్షల మంది అఫ్గాన్లకు ఆశ్రయం ఇచ్చింది. ఇప్పటికీ లక్షలాది మంది మా దేశంలోనే జీవనోపాధి పొందుతున్నారు. కానీ మా సహనం నశించింది. మేం మీ పొరుగువారమే, మీ లోగుట్టు అంతా మాకు తెలుసు. మా సైన్యం సముద్రాలు దాటి రాలేదు, ఇక్కడే ఉంది. మా దాడులకు అల్లాహ్ సాక్షిగా గట్టి సమాధానం ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.


Posted

in

by

Tags: