“పాఠం చెబుతున్న టీచర్.” బయటకు తీసుకెళ్లిన యువకుడు.. పాఠశాలలోనే జరిగిన ఘోరం.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్ అకాడమీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు నిషాత్ ఫాతిమాను పట్టపగలే తుపాకీతో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

సౌద్ అన్సారీ అనే వ్యక్తి ఆయుధంతో పాఠశాలలోనికి ప్రవేశించి, రెండో అంతస్తులో తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు నిషాత్ ఫాతిమాను బయటకు పిలిచాడు. ఇరువురి మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగిన తర్వాత, అన్సారీ ఆమెపై విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశాడు.

కాల్పుల శబ్దం విని పాఠశాల సిబ్బంది పరిగెత్తుకు రావడం గమనించిన అన్సారీ, వెంటనే తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతితో పాటు భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని, ఖండనను వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *